User Avatar Education

ఘనంగా గాయత్రి విద్య సంస్థల ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫ్రెషర్స్ డే

రాజానగరం మండలం కానవరం గాయత్రి విద్యాసంస్థల ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫ్రెషర్స్ డే బుధవారం ఘనంగా నిర్వహించారు. దీనికి నియోజకవర్గం శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రతిభ తో విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం గత ఏడాదిలో ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం 400 మార్కులు సాధించిన విద్యార్ధులకు నగదు, జ్ణాపకలు అందజేశారు. దీనిలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్, కళాశాల కరస్పాండెంట్ మూర్తి, ప్రిన్సిపాల్ దేవి బంగారం, విద్యార్ధుల తల్లితండ్రుల పాల్గొన్నారు.