User Avatar Crime

భార్యపై అనుమానంతో కిరాతకంగా కొట్టి చంపిన భర్త అరెస్టు..

భార్యపై అనుమానంతో కిరాతకంగా నాపరాయితో మెఖంపై కొట్టి చంపిన భర్తను రాజానగరం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దీనిపై పోలీసు స్టేషన్ ఆవరణలో సిఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్ ఆధ్వర్యంలో నార్త్ డిఎస్పీ వై. శ్రీకాంత్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నర్సీపట్నం మండలం గిడుగూరుకు చెందిన వేమగిరి మాణిక్యానికి కొంతమూరులో నివాసం ఉంటున్న ఉషారాణి (28)తో సుమారు పదేళ్లు క్రితం వివాహం జరిగింది. వీరికి తొమ్మిదేళ్లు కుమారుడు నిహాంక్, ఏడేళ్ల కుమార్తె నిస్సీ ఉన్నారు. కొంతమూరులో ఆమె తల్లి నల్లమాటి లక్ష్మి నివాసం ఉంటున్న ప్రక్క వీధిలో భార్య భర్త ఉంటున్నారు. కొన్ని రోజులకు భార్యపై అనుమానంతో తరుచూ భర్త గొడవలు పడేవారు. దీంత గత నెలరోజుల క్రితం పోలీసు స్టేషన్ లో ఉషారాణి ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి భర్త ఇంటికి రాకుండా బయట తిరుగుతున్నాడు. ఈనేపథ్యంలో ఈనెల 26వ తేదీ రాత్రి మాణిక్యం ఇంటికి వచ్చి ఉషారాణితో గొడవ పడి నాపరాయితో మెఖంపై బలంగా కొట్టడంతో భయపడిన పిల్లలు నిహాంక్, నిస్సీ ప్రక్క వీధిలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు. హుటాహుటిన రక్తం మడుగులో ఉన్న కుమార్తెను వైద్యం కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాగా ఆరోజు రాత్రి చికిత్స పొందుతూ ఉషారాణి చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టాగా కొంతమూరు బ్రిడ్జి దగ్గర నిందితుడు మాణిక్యాన్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేవలం రెండు రోజుల్లో నిందితుడు పట్టుకున్నందుకు సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ఐ కేవి నాగార్జున, పి. నారాయణమ్మ, హెడ్ కానిస్టేబుల్ సురేష్ బాబు, రాంప్రసాద్, కానిస్టేబుల్ అశోక్ లను ఎస్సీ నరసింహ కిషోర్, డిఎస్పీ వై. శ్రీకాంత్ అభినందించారు.