User Avatar Entertainment

ఆకట్టుకున్న బుద్ధునితో నా ప్రయాణం నాటకం 

రాజమహేంద్రవరం: బుద్ధునితో నా ప్రయాణం నాటకం గురువారం సాయంత్రం స్థానిక ఆనం కళా కేంద్రంలో  ప్రదర్శించబడింది. కార్యక్రమం ఉపాసక సిహెచ్. సుబ్బారావు బుద్ధ వందనాలతో ప్రారంభమైంది. టెక్నికల్ ఎఫెక్ట్స్‌తో సినిమా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ నాటకం, బుద్ధుని జీవిత చరిత్రను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఎంతో సహాయపడిందని వీక్షకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, ఎలక్ట్రికల్ ఎస్.ఇ కె. తిలక్ కుమార్, దళిత నాయకులు కాశీ నవీన్, దాసి వెంకటరావు, నక్క శ్రీ నాగేశ్, బాబు రాజేంద్రప్రసాద్, అంబటి సత్యనారాయణ, కోరుకొండ చిరంజీవి, జంగా సుబ్బారావు, సోమాబత్తుల విజయకుమార్, యార్లగడ్డ జగదీశ్వరరావు, మార్గాని చంటిబాబు, తురకల నిర్మల, నాగలక్ష్మి, డ్రాయింగ్ మోహన్, రేగుళ్ళ శ్రీధర్, గుడిసె వనరాజు, జంగా రాజబాబు తదితరులు హాజరై నాటక బృందానికి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. దీనిలో మర్రి బాబ్జి మాట్లాడుతూ ఇది విజయవంతంగా నిర్వహణకు సహకరించిన అందరికీ బుద్ధ వందనాలు, హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.