User Avatar others

రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మనదొర పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలి 

రాజమహేంద్రవరం, జూలై 25: రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి, కుంజం వెంకటరమణమ్మ, న్యాయసలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేసారు. రాజమహేంద్రవరంలో ఆదివాసీ స్వాతంత్ర్య సమర యోధుల కరపత్రాలను భారత న్యాయవాదుల సంఘం జాతీయ నాయకులు ముప్పాళ్ల సుబ్బారావు ఆవిష్కరించారు. అనంతరం  ప్రెస్ క్లబ్ లో  ఐనాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ

రంపలో యుద్ధం చేసిన తొలి తిరుగుబాబు వీరుడు కారం తమ్మన్నదొర అన్నారు. పోలవరం ప్రాంతంలో  కారుకొండ సుబ్బారెడ్డి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేయడంతో  ఈయనతో పాటు 10 మంది అనుచరులను  1958 అక్టోబర్ 7న  ఉరితీశారన్నారు.  ఇంతటి చరిత్రగల తొలి గిరిజన వీరుని స్మరించుకోవడంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. దీనిలో టి.సాయిపుష్ఠ, ముచ్చిక భాస్కర్ కృష్ణం రాజు, దొర, సోమాల దుర్గాప్రసాద్, సోడే పుష్ప, జక్కల పాండవులు, పూనెం విష్ణు, ముచ్చిక రంజిత్ కుమార్, గడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రారెడ్డి, రెచ్చెల అబ్బాయి రెడ్డి, మామిడి చిన్నారెడ్డి, కారం తమన్న దొర బందపల్లి, కుటుంబ సభ్యులు, కారం జగదాంబ,కారం శ్రీరాము, కారం బాపిరాజు, కారం సుజాత, కారం శ్రీనివాస్ దొర తదితరులు పాల్గొన్నారు.