User Avatar others

వాట్సాప్ నెంబరు 98666 57600 ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం…జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

జిల్లా  ప్రజలు పారిశుధ్యం, ఇంటి పన్నులు, మురుగు నీటి పారుదల, త్రాగునీరు, రోడ్డు మరమ్మతులు, ట్రాఫిక్ సమస్యలు, ధ్రువీకరణ పత్రాలు తదితర సమస్యలను నేరుగా తెలపడానికి  ప్రత్యేక వాట్సాప్ నెంబరు 98666 57600 ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్, కమిషనర్ (F.A.C) పి. ప్రశాంతి తెలిపారు. నగర, జిల్లా పౌరులు తమ పేరు, సమస్య వివరాలు, నివాస ప్రాంతం సమాచారం సహా సందేశం పంపితే సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.