User Avatar Education, News

గోదావరి గ్లోబుల్ విశ్వవిద్యాలయం యాజమాన్యం ఫీజు రీయింబర్స్మెంట్ బలవంతపు వసూళ్లు  చేస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు .

గోదావరి గ్లోబుల్ విశ్వవిద్యాలయం(జిజియు) యాజమాన్యం ఫీ రీయింబర్స్మెంట్ బలవంతపు వసూళ్ళ చేస్తూ ఒత్తిడి చేస్తున్నారని ఇంజనీరింగ్ విద్యార్థులు గురువారం ఆందోళన చేశారు. విశ్వవిద్యాలయం ప్రధాన ముఖద్వారం ముందు బైఠాయించి సుమారు రెండున్నర గంటలు మండుటెండలో  న్యాయం కోసం నినాదాలు చేయడం జరిగింది. ఆందోళన విరమించాలని విశ్వవిద్యాలయం యాజమాన్యం బెదిరించినా సరే లెక్కచేయకుండా ఆందోళన చేపట్టారు. చేసేది ఏమీ లేక యాజమాన్యం విద్యార్థుల దగ్గరకు వచ్చి ఫీజు రీయంబర్స్మెంట్ కి సెమిస్టర్ ఫీజు కి సంబంధం పెట్టమని,  ప్రభుత్వం చెల్లించే వరకూ ఎవరినీ అడగమని హామీ ఇచ్చారు.  ఈ మేరకు సాయంత్రం ఆదేశాలు నోటీసు బోర్డులో ఆదేశాలు జారీ చేసి పెట్టడం జరుగుతుంది చెప్పడం వలన విద్యార్థులు ఆందోళన విరమించారు. దీనిపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై. భాస్కర్, ఎన్. రాజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ రూ. 6 వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయని అన్నారు.  మంత్రి నారా లోకేష్ విద్యార్థులను ఇబ్బందులు పెట్టవద్దని చెప్పినా అసెంబ్లీలో చెప్పినా సరే జిజియు సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులను  పంపకుండా  ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించే వరకు సెమిస్టర్ ఫీజ్ కట్టించుకోమని, పోర్టల్ ఓపెన్ చేయమని జిజియు యాజమాన్యం చెప్పడంపై గతంలో కలెక్టర్ కార్యాలయం ఆందోళన చేయడం జరిగిందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం వేసే వరకు ఏ విద్యార్థి దగ్గర ఫీజు కట్టించుకోకుండా, ఎగ్జామ్ ఫీజు చెల్లించే విధంగా పోర్టల్ ఓపెన్ చేయాలని, ఇంటర్నల్స్ పరీక్షలు ఆపకూడదు అని విశ్వవిద్యాలయం యాజమాన్యానికి చెప్పారన్నారు. అయినా సరే యాజమాన్యం విద్యార్థులను ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తూ డబ్బులు చెల్లించే వరకు ఎగ్జామ్ ఫీస్ పోర్టల్ ఓపెన్ చేయమని చెప్పడం, మిడ్ పరీక్షలు ఆపటంతో విద్యార్థులు ఆందోళన చేపట్టాల్సి వచ్చిదన్నారు. విద్యార్ధులపై ఒత్తిడి చేస్తున్న జిజియు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిజియు యాజమాన్యం  ఆందోళన చేస్తున్న విద్యార్ధులను టార్గెట్ చేసి వేధించినా మానసికంగా బాధలు గురి చేసినా రాష్ట్ర స్ధాయిలో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. దీనిలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె. జ్యోతిర్మయి జిల్లా కమిటీ సభ్యులు సౌమ్య, కార్తీక్, లహరి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.