User Avatar News, Political

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దైర్యం లేదు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్ల అప్పులు ఉంటే,  40 శాతం ఉపాధి హామీ పనుల నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు  భరించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఈ పధకాన్ని నిర్వీర్యం చేయడం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించే దైర్యం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాజానగరం గాంధీ బొమ్మ సెంటర్ లో బహిరంగ సభ ఆదివారం ఏర్పాటు చేశారు. దీనిలో సూర్యారావుపేటలో మంచినీటి సమస్య ఉందని గ్రామానికి చెందిన మహిళా చెప్పింది. ఈ కార్యక్రమం చూడడానికి వచ్చిన వైకాపా గ్రామ సర్పంచ్ కుందేటి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామానికి రెండు కోట్లు రూపాయలతో మంచినీటి సమస్య తీర్చామని చెప్పారు. దీనిపై అధికారంలో లేనప్పుడు ప్రజల కోసం పని చేయాలని, ప్రజల సమస్యలు అసెంబ్లీలో చెప్పడానికి మీ వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాలీ లేదని రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా ఎద్దేవా చేశారు. అనంతరం తోకాడకు చెందిన బేబీ ఉపాధి హామీ పనులు చేసి నాలుగు నెలలు గడిచినా డబ్బులు పడడం లేదని, పాలచర్ల చెందిన పులివెల లత భర్త చనిపోయిన పింఛను రావడం లేదని తెలిపింది. దీనిపై మీ సమస్యలు పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చేస్తారని షర్మిల చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రం అప్పుల్లో గెంట్టేస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. వీరంతా బిజెపి ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం లేదని తెలిపారు. దీనిలో సిడబ్ల్యుసి మెంబర్ గిరుడు రుద్రరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెడి సేలం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అమర్ జహానీ, జిల్లా అధ్యక్షుడు బోడా వెంకట్, నియోజకవర్గం ఇన్ చార్జి వడియార్,  జిల్లా అధ్యక్షుడు బోడా వెంకట్,  జిల్లా మాజీ అధ్యక్షుడు టికె విశ్వేశ్వరరెడ్డి, మండల అధ్యక్షుడు ముప్పిడి శ్రీను, ఎల్లా శ్రీనివాస్ వడియార్ తదితరులు పాల్గొన్నారు.