User Avatar Crime

బావ బావమరిది పిల్లల కలిగించిన మృత్యువు..వీరిలో ఐదేళ్ల చిన్నారి.. కవలలను విడదీన మృత్యువు

.రంగంపేట మండలం వడిశలేరు ఎడిబి రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన బావమరిది, అక్క వారి పిల్లలు ఉన్నారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి ఉంది. రాజానగరం మండలం రఘనాధపురం చెందిన రేలంగి శివన్నారాయణ(45), ఇతని భార్య దేవి(32), కుమార్తెలు హర్షిత( 12), వర్షిత రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడుంగొయ్యి లో నివాసం ఉంటున్న బావమరిది తీగిరెడ్డి శివ (42), ఇతని భార్య భవానీ కుమార్తె ఐదేళ్ల చిన్నారి సావ్వి అందరూ కారులో కాకినాడ బీచ్ వెళ్లి సంతోషంగా గడిపి ఇంటికి తిరిగి సోమవారం సాయంత్రం వస్తున్నారు. మార్గమధ్యంలో రంగంపేట మండలం వడిశలేరు ఎడిబి రహదారి పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న పాలు లారీని వేగంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో శివన్నారాయణ, దేవి, హర్షిత, బావమరిది శివ, ఇతని ఐదేళ్ల కుమార్తె సావ్వి అక్కడికక్కడే మృతి చెందారు. తలకు తీవ్ర గాయాలైన భవానీ, వర్షిణి లను చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. హర్షిత, వర్షిత కవలపిల్లలు. మృత్యువు ఇద్దరినీ విడదీసింది. జీవితకాలం తోడుగా ఉండాల్సిన బావ బావమరిది మృత్యువు లో కలిసి ఆఖరి ప్రయాణం చేశారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను చూసి హృదయవిషాదంగా బంధువులు భోరున రోదించారు. దీనిపై రంగంపేట పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.