User Avatar others

వికలాంగులు, వృద్ధులకు ఇంటికి నిత్యవసర సరుకులు.. జిల్లా కలెక్టర్  

రాజమహేంద్రవరం..,జిల్లా వ్యాప్తంగా 19 మండలాల పరిధిలో 65,863మంది 65 ఏళ్లు పూర్తైన, దివ్యాంగులు , బెడ్ రీడెన్ రేషన్ కార్డు దారులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. మండలంలో లాలాచెరువు, దివాన్ చెరువు గ్రామంలో వృద్ధులు, వికలాంగుల ఇళ్ళు కు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో మంగళవారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పాల్గొన్నారు.‌ గ్రామాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ 65 ఏళ్లు నిండిన లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం నిర్ణయించిన ఆదేశాలు మేరకు సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ చేస్తారన్నారు. వీళ్ళు ద్వారా రేషన్ డీలర్లు ఆధ్వర్యంలో ఇళ్ళు కు వెళ్ళి రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి ఐదొవ తేదీ వరకూ ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా అందచేసే నిత్యవసర సరుకులు పంపిణీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 871 చౌక ధరల దుకాణాల డీలర్లు 5,64,994 మంది రేషన్ కార్డు దారులు ఉండగా వారిలో 65 ఏళ్ల పూర్తిన వారు 65,863 మంది ఉన్నారన్నారు. గత మూడు రోజులుగా 17286 బియ్యం, 16483 షుగర్, 1512 కంద పప్పు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. దీనిలో రెవెన్యూ అధికారులు, పౌర సరఫరాల అధికారులు, రేషన్ షాపు డీలర్లు పాల్గొన్నారు.