User Avatar others

తీర్ధ యాత్రలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

రాజమహేంద్రవరం….యాత్రికుల సౌందర్య కోసం ఎపిఎస్ ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో నుండి తీర్ధ యాత్రలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని డిపో మేనేజర్ ఎస్ కె షబ్నం తెలిపారు. వీటి వివరాలను మంగళవారం విలేకరులకు వెల్లడించారు. రాజమహేంద్రవరం డిపో నుండి ఈనెల 10వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తమిళనాడులో అరుణాచలం, తిరుమల, కాణిపాకం క్షేత్రాలు నాలుగు రోజులు యాత్ర టికెట్ ధర రూ.3500 ఉంటుందన్నారు. ఇదేవిధంగా ఈనెల 27వ తేదీన కాణిపాకం, అరుణాచలం, శ్రీపురం, ఫళని, కోయంబత్తూర్, ఊటీ, గురువాయూర్, త్రివేండ్రం, రామేశ్వరం, మదురై, తంజావూరు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడం జరిగిందని టికెట్ ధర రూ.11,300 నిర్ణయించామన్నారు. పూర్తి వివరాలకు 9502300189,996666544 ఫోన్ నెంబర్ల సంప్రదించాలని కోరారు.