User Avatar Crime

మునికూడలి ఇసుక ర్యాంపులో అక్రమ తవ్వకాలు…

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి ఇసుక ర్యాంపులో మంగళవారం రాత్రి అక్రమ ఇసుక తవ్వకాలకు జరిగాయి. దీని వలన ప్రభుత్వ ఆదాయానికి, పర్యావరణాకి తీవ్ర నష్టం జరుగుతుంది. రాజకీయ నాయకులు, అధికారులు అండతో అక్రమ తవ్వకాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా పరిమితి మించి భారీ ప్రొక్లీనర్లతో తవ్వకాలు జరిపి లారీ, ట్రాక్టర్లుతో  గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. దీనిపై రెవెన్యూ మైనింగ్ అధికారులకు సమాచారం తెలిపినా స్పందించలేదు అని స్ధానికులు తెలిపారు. అక్రమ తవ్వకాలు వలన భూగర్భ జలాలు, పర్యావరణం, నదీ పరివాహక ప్రాంతం నాసనం అవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలు నిలుపుదల చేసి కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.‌