User Avatar others

ప్రచారానికి పరిమితమైన పర్యావరణ దినోత్సవం.. కాలుష్య కోరల్లో రాజానగరం..

రాజమహేంద్రవరం..పర్యావరణ దినోత్సవం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుంది. దీనిని కాపాడాల్సిన అధికారులు, నాయకులు ఫోటోలకు ఫోజులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా పల్లెలు, పట్టణాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి. పర్యావరణం ముఖ్యంగా వాయువు నీటి కాలుష్యము వలన పాడైపోతుంది. దీనిని నేటి పాలకులు, అధికారులు గాలి నీరు యదేచ్ఛగా కలుషితం చేసి ప్రజల ప్రాణాలు బలి కొంటున్నారు. పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో కార్పొరేట్ ఫ్యాక్టరీలు, ఆసుపత్రిలు వలన ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి నుండి వచ్చే వ్యర్ధాలు, కలుషిత నీరు, విషవాయువులు ఆ గ్రామాల పరిధిలో వదులుతున్నారు. దీని వలన వచ్చే దుర్గంధం వలన ప్రజలు ఆనారోగ్యం చెందుతున్నారు. ఇదేవిధంగా ఏళ్ళ తరబడి జిఎస్ఎల్ మెడికల్ కళాశాల జనరల్ ఆసుపత్రిలో ఉపయోగించిన వ్యర్ధాలు రాజానగరం గ్రామం రావులచెరువు గట్టు ప్రక్కన ఆసుపత్రి ట్రాక్టర్లు, వ్యాన్ లో తీసుకుని వేస్తున్నారు. రోగులు, వైద్యులు ఉపయోగించి రక్తం అంటకున్న మాస్కులు, దుస్తులు, ఇంజెక్షన్లు, గాజు గుడ్డలు నేరుగా వేస్తున్నారు. ఇవి గాలికి ఎగిరి ఇళ్ళు లో కి వస్తున్నాయి. వర్షాకాలంలో నీరు వ్యర్ధాలతో కలిసి పోయి గ్రామానికి మంచినీరు అందిస్తున్న రావులచెరువు లో వస్తున్నాయి. భారీ వర్షాలకు ఇళ్ళలోకి వ్యర్ధాలు కొట్టుకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలుష్య ప్రభావం గ్రామంలో వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారు. జిఎస్ఎల్ మెడికల్ కళాశాల జనరల్ ఆసుపత్రిలో వ్యర్ధాలపై ఆందోళనలు ధర్నాలు చేసిన అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కూటమి నాయకులు పట్టించుకోవడం లేదు. గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు రాసిన వినతి పత్రాలు బుట్టదాఖలైనాయి. కంచే చేను మేసింది అనే చందంగా అధికారులు, నాయకుల ప్రజల ప్రాణాలు కాలుష్యం కోరల్లోకి నెట్టేస్తున్నారు. దీనిపై ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు ఉద్యమించి నాయకులు, అధికారుల చర్యలను ఎండగట్టాలని. లేనిచో నియోజకవర్గం ప్రధాన కేంద్రం రాజానగరం కాలుష్యం కాటు తప్పదు.