User Avatar Education

గాయత్రీ విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విజయ ఢంకా..

రాజానగరం మండలం కానవరం గాయత్రీ విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విజయ ఢంకా మోగించిందని. ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాలు శనివారం విడుదల చేసింది. దీనిలో గాయత్రి విద్య సంస్థలో చదువుకున్న ఎంపీసీ విభాగంలో ఎం.సురేంద్రబాబు 470 మార్కులకు 465 సాధించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాడు.‌ ఇదేవిధంగా వై.ప్రియ అక్షయ 463, ఎస్ లక్ష్మీ తులసి 463,  వై యమునా దేవి 461, జి లక్ష్మి 460 మరో 56 మందికి 400 పైగా మార్కులు సాధించడం జరిగింది. బైపిసీ విభాగంలో వై.దేవి అర్చన 440 మార్కులకు 429, ఎన్. సత్య 425 సాధించారు. వీరిని విద్యా సంస్థ కరెస్పాండెంట్ వివిఎస్ఎన్ మూర్తి అభినందించి మాట్లాడుతూ ఈ ఘన విజయం సాధించడానికి సహకారం అందించిన విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు రాష్ట్ర స్ధాయిలో ప్రతిభ కనబరచడంపై హర్షం వ్యక్తం చేశారు.  విద్యార్ధులకు ఒత్తిడి లేని విద్యను అందించడం ద్వారా మంచి ఫలితాలు సాధించడం జరిగిందని తెలిపారు.  ఈ ఫలితాలు తమపై మరింత బాధ్యత పెరగడంతో వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్రస్థాయి ర్యాంకుకు కృషి చేస్తామని విద్యా సంస్థల ప్రిన్సిపల్ దేవీ బంగారం అన్నారు.