User Avatar Crime

రాజానగరం లో రూ.12,50,000 విలువైన రేషన్ బియ్యం స్వాధీనం…

రాజానగరం జాతీయ రహదారి బిపిసిఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో  లారీలో  అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీ సీజ్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.‌ అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. పెట్రోల్ బంక్ సమీపంలో బియ్యం ఉన్న లారీ అనుమానం వచ్చి అపడంతో లారీ డ్రైవర్ పరారైనాడు. ఐదు గంటల వరకు చూసిన తర్వాత డ్రైవర్ రాకపోవడంతో లారీ క్యాబిన్  లో తాళాలు తీసుకుని రికార్డు పరిశీలించగా పల్నాడు జిల్లా నకిరేకల్ గా చెందినదిగా గుర్తించారు.  దీనిలో సుమారు గా రూ.12,50,000 విలువైన రేషన్ బియ్యం 25 నుండి 30 టన్నులు ఉంటుందన్నారు. లారీ విలువ రూ.15,00,000 మెత్తం రూ.27,50,000 వరకు ఉండవచ్చు అన్నారు.