User Avatar others

పత్తా లేని సచివాలయం కార్యదర్శిలు.. మెక్కిబడిగా విధులకు వస్తున్న సిబ్బంది… 

రాజానగరం  …  ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. దీనిలో అధికారులు  అంకిత భావంతో పని చేసినప్పుడు ప్రభుత్వ లక్ష్యాలు నిరవేరతాయి. దీనికి రాజానగరం మండలంలో గ్రామ సచివాలయం ఉద్యోగులు  తూట్లు పొడుస్తున్నారు. ఫలితంగా  సచివాలయం వ్యవస్ధ నిర్వీర్యమైంది . మండలంలో 34 గ్రామ సచివాలయాలు ఉన్నాయి.  ప్రతి సచివాలయంలో కార్యదర్శి డేటా ఆపరేటర్, సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎంఎన్ఎమ్, విలేజ్ అగ్రిమెంట్ అసిస్టెంట్, విలేజ్ ఆర్టికల్చర్ అసిస్టెంట్,  విలేజ్ సర్వేయర్, విలేజ్ ఫిషర్ మేన్ అసిస్టెంట్, యానిమల్ హజ్బెనరీ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. మండలంలో తోకాడ, కానవరం, మల్లంపూడి, పాలచల్ల, పుణ్యక్షేత్రం, దివాన్ చెరువు, తూర్పుగానుగూడెం, వెలుగుబొంద, హౌసింగ్ బోర్డు, పుణ్యక్షేత్రం తదితర కార్యదర్శులు తోపాటు మిగిలిన ఉద్యోగులు సమీప పట్టణాల్లో నివాసం ఉంటూ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నారు.  కార్యాలయాలకు ప్రభుత్వ పింఛన్లు ఇచ్చే నెలలో మెదటి రెండు రోజులు మాత్రం విధులకు వస్తుంటారు. మిగిలినవి రోజుల్లో విధులకు డుమ్మా కొడుతారు.  కొందరు కార్యదర్శిలు వేసవి కాలంలో శీతల ప్రదేశాలకు, మరికొందరు తీర్ధయాత్రలో ఉన్నారు. అయితే వీరంతా ప్రతి రోజు కార్యాలయాలకు విధులకు వస్తున్నట్లుగా క్రింది స్థాయి సిబ్బంది రికార్డుల్లో నమోదై ఉంటుంది. ఉన్నత అధికారులు తనిఖీలకు వస్తే క్రింద స్ధాయి సిబ్బంది దగ్గర రెడీ మేడ్ లీవ్ లెటర్ రెడీగా ఉంటుంది. ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి  కార్యాలయానికి వెలితే కార్యదర్శిలు జిల్లా కలెక్టర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో సమావేశాల్లో ఉన్నారని సిబ్బంది తెలిపారు. కోర్టుకు సెలవులు ఇచ్చారు, అయినా సరే కొందరు  క్రింది స్థాయి సిబ్బందికి తెలియకపోవడంతో ఎప్పటిలాగే కార్యదర్శి గారు కోర్టు పని మీద అమరావతి వెళ్ళారని చెబుతుండడం విశేషం. సిబ్బంది జీతాలు, గ్రామాల్లో పనులకు సంతకాల కోసం ఇంటికి రావాలని సిబ్బందిని కార్యదర్శి ఆదేశాలు ఇస్తున్నారు. కార్యదర్శిల తీరు ఇలా ఉంటే సచివాలయాల్లో క్రింది స్థాయి మిగిలిన ఉద్యోగుల పరిస్థితి చెప్పక్కర్లేదు. అడిగే వారు లేకపోవడంతో కొందరు సిబ్బంది కార్యాలయాల్లో కాలు పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఒక గ్రామ సచివాలయంలో 12 సిబ్బంది ఉంటే  ఒకరిద్దరు వారిలో ఒకరు కంప్యూటర్ డిజిటల్ అసిస్టెంట్ మాత్రం వస్తుంటాడు.  మిగిలిన సిబ్బంది కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి రెండున్నర గంటలు కాలక్షేపం చేసి మధ్యాహ్నం మూడు దాటుకుండా కార్యాలయానికి తాళాలు వేస్తున్నారు. దీంతో గ్రామ కార్యదర్శిలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో సచివాలయం ఉద్యోగులు విధులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.