User Avatar Crime

అక్రమంగా తరలిస్తున్న 1268 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం…

రాజానగరం జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 1268 కేజీల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. తణుకు నుండి జగ్గంపేట బొలెరో వాహనంలో  రేషన్ బియ్యం  తెలుపు ఇతర రంగుల్లో 32 ప్లాస్టిక్ సంచుల్లో  జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా మండల పౌర సరఫరాల అధికారి గొలుగూరి బాపిరాజు గుర్తించారు. వెంటనే  వాహనాన్ని సీజ్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. దీనిలో 1268 కేజీల బియ్యం సుమారు రూ.58,328 విలువ ఉందన్నారు.