User Avatar Crime

గంజాయి వ్యాపారం చేస్తున్న భార్యాభర్తలు…కేసు నమోదు 23.101 కేజీల గంజాయి స్వాధీనం.

రాజానగరం.. ఒక రేకుల షెడ్ సిసి కెమేరా నిఘా మధ్య అక్రమ గంజాయి నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న భార్యాభర్తలు, సహాకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజానగరం పోలీసులకు పట్టుకున్నారు. వీటిపై కేసు నమోదు చేసి ఒక వ్యాన్, కారు, రెండు మోటారు సైకిళ్ళును, రేకుల షెడ్ సీజ్ చేశారు. దీనిపై సి.ఐ ప్రసన్న వీరయ్య గౌడ్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ డిఎస్పీ వై. శ్రీకాంత్ పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం శనివారం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. మండలంలో కొండగుంటూరు కొండాలమ్మ గుడి సమీపంలో ప్రైవేట్ లే అవుట్ రేకుల షెడ్ లో సిసి కెమేరా పర్యవేక్షణలో ఒరిస్సా జిల్లా చిత్రకొండ రఘువీర్ రాయ్, ఇతని భార్య ప్రశాంతి రాయ్ గంజాయి అక్రమ నిల్వ ఉంచి రవాణా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు శుక్రవారం సాయింత్రం కారులో భార్యాభర్తలు గంజాయి తీసుకుని వచ్చినట్లు తెలిసింది. దీనిని ఒరిస్సా రాష్ట్రం మల్కాగిరి జిల్లా చిత్రకొండ మండలం దొరగుడ పంచాయతీ సురేష్ చంద్ర కులదీప్, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పొల్లూరు గ్రామం చెందిన చందన్ మండల్ కారులో నుండి 11 ప్యాకెట్లు 23.101 కేజీల గంజాయి దించుతుంగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. వెంటనే గంజాయి, రవాణాకు ఉపయోగిస్తున్న ఒక వ్యాన్, కారు, పైలెట్ రెండు మోటారు సైకిళ్ళు సీజ్ చేశారు. సురేష్, చందన్ కోర్టులో హాజరు పరిచారు. అక్రమ వ్యాపారానికి సూత్రధారి రఘువీర్ రాయ్ అతని భార్య ప్రశాంతి పరారీలో ఉన్నారని డిఎస్పీ తెలిపారు. గంజాయి ఎక్కడకు తరలిస్తున్నారు ఆనేది వీరిద్దరూ పట్టుబడిన తర్వాత దర్యాప్తులో తెలుస్తుందన్నారు. ఈ అక్రమ సంపాదనతో కొంతమూరులో విశాలమైన ఇల్లు కొనుగోలు చేసుకుని నివాసం ఉంటున్నారని చెప్పారు. కొండ గుంటూరులో రేకుల షెడ్ సీజ్ చేశామని, కొంతమూరు ఇల్లు సీజ్ చేయడానికి ఉన్నత అధికారులకు నివేదికలు పంపామన్నారు. దర్యాప్తులో పాల్గొన్న ఎస్ఐ లు కెవి నాగార్జున సిబ్బంది కరీం, సురేష్, త్రిమూర్తులు, మహేశ్వరరావు, మురళీ, రాంప్రసాద్, నాగార్జున అభినందించారు.