User Avatar others

మాధవరాయుడుపాలెం స్థలంలో అన్యాయం జరిగింది.. దర్శకుడు గీతాకృష్ణ

కడియం మండలం మాధవరాయుడుపాలెంలో మా తాతల నుండి వచ్చిన స్థలంలో నా అనుమతి నాతో చెప్పకుండా సచివాలయం, కమ్యూనిటీహాలుకు శంకుస్థాపన చేశారని ప్రముఖ సినీ దర్శకుడు, ఫైర్ బ్రాండ్ యూట్యూబర్ అన్నందేవుల గీతాకృష్ణ అన్నారు. దీనిపై రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం కొంత స్థలాన్ని పంచాయితీకి ఇవ్వాలని మా పెద్దలు నిర్ణయించగా అది రిజస్టర్ చేసుకోకుండా ఎంపీ, ఎమ్మెల్యేలతో కొబ్బరికాయ కొట్టించిన తర్వాత గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఆర్డీవో ల కు పిర్యాదు చేసానని తెలపారు. సర్పంచి చంటి గ్రామంలో చాలా దారుణాలు చేస్తూన్నాడని చర్యలు తీసుకోవాలని కోరారు.