User Avatar Crime

లారీ డ్రైవర్ మధ్యం మత్తులో ప్రమాదం…

రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో నారాయణపురం ఎడిబి రోడ్ పై లారీ డ్రైవర్ మధ్యం మత్తులో ఒక వ్యక్తిని ఢీ కొట్టిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులతో కారులో రాజమహేంద్రవరం నుండి పెద్దాపురం వెళుతుండగా మార్గమధ్యంలో నారాయణపురం రహదారిపై కారు టైరు గాలి తగ్గిడంతో కొడుకు టైరు మార్చుతుంగా తండ్రి చెరుకూరి సత్యనారాయణ కారు ప్రక్కన ఉన్నాడు. అదే రహదారిపై కాకినాడ వైపుకు పామాయిల్ లోడుతో వెలుతున్న లారీ సత్యనారాయణను ఢీ కొంది. ఈ ప్రమాదంలో అతని కుడికాలు తొడ భాగం నుజ్జునుజ్జు అయింది. హుటాహుటిన 108లో ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మధ్యం మత్తులో ప్రమాదం చేశాడని, క్లీనర్ మధ్యం మత్తులో సృహలేకుండా లారీలో పడుకున్నాడని స్ధానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.