User Avatar Crime

పాము కాటుకు రైతు మృతి 

 చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన ఆత్కూరి పెద్ద సత్యనారాయణ (51) మంగళవారం ఉదయం పొలంలో గడ్డి కోస్తుండగా పాము కుట్టుంది. ఏదో పురుగు కుట్టిందకుని గడ్డి కోసుకుని వస్తుండగా తల బరువెక్కి కేకలు వేశాడు. వెంటనే చుట్టుపక్కల రైతులు గమనించి మోటారు సైకిల్ పై ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాగా అప్పటికే సత్యనారాయణ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడుకి భార్య ఒక కుమారుడు ఒక కుమార్తెఉన్నారు.