User Avatar others

కార్మిక సంఘాలు ఛలో రాజానగరం….

రవాణా వాహనాల ఫిట్‌నెస్‌ రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేట్‌ సంస్థలకు కూటమి ప్రభుత్వం ఇవ్వడాన్ని నిరసిస్తూ వాహనాల యజమానులు, కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో మంగళవారం ఛలో రాజానగరం నిర్వహించారు. ముందుగా రాజమహేంద్రవరం కంబాల చెరువు, హైటెక్‌ బస్టాండ్‌ నుండి లారీలు, ఆటోలు, మినీ వ్యాన్లు, గూడ్స్‌ వాహనాల యజమానులు డ్రైవర్లు రాజానగరం కలవచర్ల రోడ్ ఎటిఎస్‌ సెంటర్‌ వరకు ర్యాలీ చేశారు. అనంతరం ధర్నా నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఆటోలు, మినీ వ్యాన్లు వాహనాలపై ఆధారపడి జీవిస్తున్న వారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నారగన్నారు. వెంటనే ఈ విధానాన్ని ఉప సంహరించుకుని, పాత పద్ధతిలోనే ఎంవిఐ ద్వారా వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీ పద్దది ఉండాలని కోరారు. దీనికి మాజీ ఎంపీ మార్గాని భరత్, డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పాల్గొని మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు పోలుపల్లి నాగేశ్వరరావు, సప్పా ఆదినారాయణ, కాకినాడ కృష్ణ, జి.నరసింహారావు, యూనియన్‌ నాయకులు గోపాల్‌, రావు, తదితరులు పాల్గొన్నారు.