User Avatar Crime

దివాన్ చెరువు లో అక్రమ ఇసుక నిల్వలు సీజ్…

రాజానగరం మండలం దివాన్ చెరువు బీజాపూరి టౌన్ షిప్ లో ఆక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయని పిర్యాదు రావడంతో జిల్లా మైన్స్ అధికారి డి.ఫణి భూషణ్ రెడ్డి శనివారం తనిఖీలు చేపట్టారు. దీనిలో రెండు ప్రదేశాలలో 260 టన్నులు, 500 టన్నులు అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయని గుర్తించారు. వీటిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. సాంకేతిక సిబ్బంది మనీషా, శైలజ, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి ఎస్. ఐ. ఆంజనేయులు, ఆర్.టి.ఓ.హోమ్ గార్డ్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.