User Avatar Crime

ఇళ్ళలో చోరీ నిందితులు అరెస్టు…

తాళాలు పగులగొట్టి ఇంట్లో బంగారం, నగదు దొంగిలించిన  ముగ్గురు వ్యక్తులను రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుండి ఒక లక్షా 15 వేలు నగదు, 22 కాసుల బంగారం వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను పోలీసు స్టేషన్ ఆవరణలో సిఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ డిఎస్పీ వై. శ్రీకాంత్ విలేకరుల సమావేశంలో బుధవారం తెలిపారు. మండలంలో నామవరం పాతరామాలయంలో ఉంటున్న రేలంగి లోవరాజు  ఈనెల 2వ తేదీన ఉదయం ఇంటికి తాళాలు వేసి తుని సమీపంలో తలుపులమ్మ లోవ ఆలయానికి వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు తీసి ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేసించి ఇంట్లో ఒక లక్షా 75 వేలు నగదు, 22 కాసుల బంగారం వస్తువులు  దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ కేసు నమోదు చేపట్టారు. దీనిలో రాజమహేంద్రవరం రూరల్ మండలం నలబా సత్యనారాయణ, బెందపూడి రత్నరాజు,  ఇసకోటి పవన్ కుమార్ నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వీరి నుండి ఒక లక్షా 15 వేలు నగదు, బంగారం వస్తువులు హారం, తాడు, నక్లీస్, చెవులీలు, నాలుగు ఉంగరాలు, మూడు చైన్లు, చేతి కడియాలు మూడు స్వాధీనం చేసుకున్నారు.  దర్యాప్తు చేపట్టిన సిఐ,  ఎస్ఐలు కుమార్, బలసౌరి, నాగార్జున, హెడ్ కానిస్టేబుల్స్ అమ్మి రాజు, సత్యనారాయణ, కరీం, సురేష్, మురళీ, ప్రసాద్, ఐ.రమణ, శివరామకృష్ణలను ఎస్పీ, డిఎస్పీ అభినందించారు.