User Avatar Political

కోవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జి బాధ్యతలు నుండి టి.వి.రామారావు తొలగింపు

తూర్పుగోదావరి జిల్లా కోవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే టి.వి.రామారావును పార్టీ ఇన్ చార్జి బాధ్యతలు నుండి తొలగిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనేజ్మెంట్   విభాగం వేములపాటి అజయ్ కుమార్ ప్రకటణ విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం స్పూర్తికి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వలన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తదుపరి నిర్ణయం చెప్పే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు.