User Avatar Crime

నీటి గుంటలో పడి నాలుగున్నర ఏళ్ల బాలుడు మృతి…

రాజానగరం మండలం దివాన్ చెరువు రేగుల చెరువు సమీపంలో జంగాల కాలనీలో జల సరఫరా పనుల కోసం ఓహ్ఎస్ఆర్ వాల్వ్ లో పడి నాలుగున్నర ఏళ్ల బాలుడు శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈనెల 10 వ తేదీన అడుగుల ఆరంగులాల గుంత తవ్వి మారామత్తు కోసం ఓహ్ఎస్ఆర్ వాల్వ్ రాజమహేంద్రవరం పంపడం జరిగింది. దీనిలోకి వర్షం నీరు చేరడంతో అక్కడే ఆడుతున్న కుంటున్న నాలుగున్నర ఏళ్ల  బాలుడు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. హుటాహుటిన  జిల్లా కలెక్టర్ పీ. ప్రశాంతి  ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బాలుడి తండ్రి దుర్గా ప్రసాద్ రోజువారీ కూలీగా జీవనం కొనసాగిసతాడు. కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ తదితరులు ఉన్నారు.