User Avatar Crime, others

కమీషన్లు కోసం పని చేస్తున్న సచివాలయం కార్యదర్శులు….పసి పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా…?

పసి పిల్లలు, ప్రజలు ప్రాణాలు పోతున్నా కనికరం లేని కసాయి కార్యదర్శిలు పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులు మెప్పు పొందడానికి కమీషన్లు పేరుతో డబ్బులు దండు కోడానికి చేయడానికి మాత్రమే పని చేస్తున్నారు. గ్రామాల్లో అనాధికార లేఅవుట్లు తోపాటు గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్ళిస్తుంటారు. దీని కోసం ఉన్నత అధికారులు, రాజకీయ నాయకుల మెప్పు కోసం వెంపర్లాడుతుంటారు. మండలంలో 34 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో కార్యదర్శి తోపాటు డేటా ఆపరేటర్, సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎంఎన్ఎమ్, విలేజ్ అగ్రిమెంట్ అసిస్టెంట్, విలేజ్ ఆర్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, విలేజ్ ఫిషర్ మేన్ అసిస్టెంట్, యానిమల్ హజ్బెనరీ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. మండలంలో తోకాడ, కానవరం, మల్లంపూడి, పాలచల్ల, పుణ్యక్షేత్రం, దివాన్ చెరువు, తూర్పుగానుగూడెం, వెలుగుబొంద, హౌసింగ్ బోర్డు, పుణ్యక్షేత్రం తదితర కార్యదర్శులు సమీపంలో పట్టణాల్లో నివాసం ఉంటూ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు కార్యదర్శిలు సచివాలయాని వచ్చి క్షేత్ర స్ధాయిలో పారిశుద్ధ్య, తాగునీరు, వీధి లైట్లు, ఇంటి పన్నులు తదితర వాటిని పరిశీలించి పర్యవేక్షణ చేపట్టాలి. వీరంతా ప్రభుత్వ పింఛన్లు ఇచ్చే నెలలో మెదటి రెండు రోజులు మాత్రం విధులకు వస్తుంటారు. మిగిలినవి రోజుల్లో విధులకు డుమ్మా కొడుతూ సొంత పనులు చేసుకుంటారు. అయితే వీరంతా ప్రతి రోజు కార్యాలయాల్లో విధులకు వస్తున్నట్లుగా క్రింది స్థాయి సిబ్బంది రికార్డుల్లో నమోదై ఉంటుంది. ఉన్నత అధికారులు తనిఖీలకు వస్తే క్రింద స్ధాయి సిబ్బంది దగ్గర రెడీ మేడ్ లీవ్ లెటర్ రెడీగా ఉంటుంది. ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి కార్యాలయానికి వెలితే కార్యదర్శిలు జిల్లా కలెక్టర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలకు సమావేశాల్లో ఉన్నారని లేదా హైకోర్టు పనిపై అమరావతి వెళ్ళారని క్రింది స్థాయి సిబ్బంది చెబుతారు. కార్యదర్శిల ముఖ్యమైన సంతకాలకు క్రింద స్ధాయి సిబ్బందిని ఇంటికి రావాలని ఆదేశాలు ఇస్తున్నారు. అయితే గ్రామాల్లో గుప్పెడు బ్లీచింగ్ చిమ్మిరు. డ్రైనేజీ లో మురికి నీరు నిల్వలు పేరుకుపోయినా పట్టించుకోరు. రికార్డుల్లో దొంగ బిల్లు పెట్టి ప్రజలకు సేవలు కల్పించకుండా నిధులు మింగేస్తున్నారు. దీనికి ఉన్నత అధికారులకు రాజకీయ నాయకులకు భారీగా డబ్బులు ముట్ట చెబుతున్నారు. దివాన్ చెరువు గ్రామ పరిధిలో నీటి గుంటలో నాలుగున్నర ఏళ్ల బాలుడు మృతి చెందడం కార్యదర్శుల నిర్లక్ష్యం అర్థం పడుతుంది. నాలుగు రోజులు క్రితం మంచినీటి కులాయి గొయ్యి పూడ్చ లేదు. ఆ గొయ్యిపై నాలుగు కర్రలు దానిపై టార్బుల్ వేసినా బాలుడు ప్రాణాలు దక్కేవి. అధికారులు పర్యవేక్షణ క్రింది స్థాయి సిబ్బంది విధులు నిర్లక్ష్యం చిన్నారిని బలి తీసుకుంది కాబట్టి వారందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇదేవిధంగా గ్రామాల్లో కార్యదర్శి పని తీరు, అక్రమ సంపాదనపై ఉన్నత అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. గ్రామాల్లో విషాద సంఘటనలు జరిగినప్పుడు ఉన్నత అధికారులు నాలుగు రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకుంటే అవినీతిలో భాగం పంచుతున్నట్లే