User Avatar Crime

అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలపై కేసులు..

రాజానగరం మండలం కలవచర్ల పోలవరం ఎడమ కాలువ గట్లు మట్టి అక్రమంగా తరలిస్తున్న సుమారు ఎనిమిది లారీ లను పట్టుకున్నారు. వీటిని తహశీల్దార్ కార్యాలయంలో ఉంచారు. చాలా కాలం నుండి కలవచర్ల కాలువ గట్లు ఇరవైనాలుగు గంటలు అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. దీనికి రెవెన్యూ, మైనింగ్, అధికార పార్టీ, స్ధానిక నాయకులకు  లక్షలాది రూపాయలు డబ్బులు ఇస్తున్నారు అనేది తెలిసిందే. పంపకాలు తేడాలు వలన  అధికారులు దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు అని ఆరోపించారు వస్తున్నాయి. అయితే దీనిపై తహశీల్దార్ జిఎవిఎల్ లక్ష్మి మాట్లాడుతూ రాజానగరం సమీపంలో సూర్యారావుపేట జాతీయ రహదారి ప్రక్కన అపార్ట్మెంట్ నిర్మాణం కోసం లారీల్లో పొలాల్లో మట్టిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు.