User Avatar others

రాజానగరం నియోజకవర్గం స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం

స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం రాజానగరం మండల ప్రజా పరిషత్ హాల్లో బుధవారం నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గం ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, బూరుగుపూడి గాడాల రహదారిలో 100 పడకల ఆసుపత్రి, బ్లడ్ బ్యాంక్, డిజిటల్ లైబ్రరీ, ప్రతి ఇంటికి గోదావరి జలాలు, రైతులకు సాగునీరు అందించడం కృషి చేయాలని అధికారులకు సూచించారు. 108 కోట్ల అంచనాతో లింక్ రోడ్లు, ములకలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. దీనిలో ఇన్ చార్జి ఆర్డీవో భాస్కర రెడ్డి,  ఎంపిడిఓలు, తహసిల్దార్లు  సీతానగరం మండలం ఎం.భారతి, అంకం శ్రీనివాస్, రాజానగరం మండలం జెఎ ఝాన్సీ, జెఎవిఎల్ లక్ష్మి, కోరుకొండ మండలం బత్తిన అశోక్ కుమార్‌, సుస్వాగతం  తో పాటు  25 శాఖల అధికారులు పాల్గొన్నారు.