User Avatar others

చేనేత వస్త్రాలపై 30% నుండి 67% ప్రత్యేక తగ్గింపు – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

ఆషాడం, శ్రావణమాసం సందర్భంగా ఆప్కో మెగా సేల్స్ ఎగ్జిబిషన్ ను లాలాచెరువు ఆప్కో విక్రయ కేంద్రంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి మంగళవారం ప్రారంభించారు. చేనేత వస్త్రాలను పరిశీలించి మాట్లాడుతూ బందరు, వెంకటగిరి, మాధవరం, చీరాల, ఉప్పాడ చీరలు, షర్టింగ్, దోవతులు, దుప్పట్లు, లుంగీలు, టవల్స్ తదితర వాటిపై 30 % నుంచి 67% వరకు ప్రత్యేక తగ్గింపు ఉందన్నారు . ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత వస్త్ర పరిశ్రమలు ప్రోత్సాహించాలని కోరారు. భారత దేశ సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలు, కుర్తాలు, శాలువాలు, లుంగీలు, ఫ్యాషన్ ఉపకరణాలు సాంప్రదాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది చెప్పారు. దీనిలో ఆప్కో మండల వాణిజ్య అధికారి బి. హరి ప్రసాద్ రావు తదితరులు పాల్గొంటారు.