User Avatar Education

ఎస్.కె.ఆర్ ఎం.బి.ఏ కాలేజీలో ఏ.ఐ ఆధారిత కోర్సులు ప్రారంభం

రాజమహేంద్రవరం…సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆశయానికి తగ్గట్టుగా శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా ఎంబీఏ కాలేజీ తన విద్యార్థినుల భవిష్యత్తును సాంకేతికంగా శక్తివంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ప్రారంభించింది. ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ విద్యతోపాటు, టెక్నాలజీ రంగంలో మహిళలు ప్రగతి సాధించేందుకు ఎంబీఏ చదువుతున్న విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుత రోజుల్లో ఏ రంగంలోనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం అవసరమని, ఈ కోర్సులు తమకు కెరీర్‌లో కొత్త అవకాశాలను అందిస్తాయని ఏ.ఐ కోర్సులు నేర్చుకుంటున్న విద్యార్థినులు అన్నారు. లెక్చరర్స్ కె. ఝాన్సీ, ఎం. విశాలాక్షి మాట్లాడుతూ, ఏ .ఐ శిక్షణ ద్వారా మేనేజ్మెంట్ విద్యార్థినులు బిజినెస్ కంటెంట్ క్రియేషన్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ ఆటోమేషన్, టాలీ మరియు అకౌంటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని, వారి కెరీర్ లో మంచి భవిష్యత్తు పొందేందుకు దోహదపడుతుంది అని పేర్కొన్నారు.