User Avatar Crime

ముగిసిన అక్రమ మట్టి లారీల డ్రామా…

రాజానగరం మండలంలో అక్రమ మట్టి తవ్వకాల వ్యాపారులు, అధికారులు, నాయకులకు ఒప్పందం కుదరడంతో కేసులు నమోదు చేయకుండా నిబంధనలు ప్రకారం లారీలను పంపడానికి అనుమతులు మంజూరి కోసం రంగం సిద్ధం చేశారు.  మండలంలో కలవచర్ల పోలవరం ఎడమ కాలువ గట్లు మట్టి, పల్లకడియం, కానవరం, జి. ఎర్రంపాలెం, కొత్తతుంగపాడు తదితర ప్రాంతాల్లో అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు ప్రతి రోజు ఇరవైనాలుగు గంటలు జరుతాయి. దీనిపై ముందుగా కూటమి నాయకులకు, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో మామోళ్ళు ఒప్పందం కుదిర్చికోవడం వలన ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మామోళ్ళు చెల్లించకుండా తవ్వకాలు జరిపి మట్టి తరలిస్తున్న లారీలను కూటమి నాయకుల ఆదేశాల మేరకు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ విధంగా మండలంలో కూటమి నాయకులు, అధికారులు కలిసి అక్రమ మట్టి రవాణా వ్యాపారం భారీ జరుగుతుంది. ఈ నేపధ్యంలో గురువారం అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను తహశీల్దార్ జిఎవిఎల్ లక్ష్మి పట్టుకున్నారు. రాజానగరం సమీపంలో సూర్యారావుపేట జాతీయ రహదారి ప్రక్కన అపార్ట్మెంట్ నిర్మాణం కోసం లారీల్లో పొలాల్లో మట్టిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. దీనిలో ఆరు లారీలు కలవచర్ల పోలవరం కాలువ గట్టు మట్టి, మరో నాలుగు లారీలు పాలచర్ల పొలాల్లో మట్టి కి అనుమతులు ఉన్నారన్నారు. రెండు లారీలకు అనుమతుల కోసం నగదు చలానా తీసి తర్వాత అనుమతులు మంజూరి చేయడం జరుగుతుందని చెప్పారు. అయితే అక్రమ తవ్వకాలదారులు ముందుగా డబ్బులు చెల్లించకపోవడం వలన అధికారులు దాడుల చేయడం, ఒప్పందాలు తర్వాత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం లారీలకు అనుమతులు మంజూరి చేయడం ఇదంతా ఒక డ్రామా అని పలువురు తెలుపుతున్నారు.