User Avatar others

ఎరువుల పంపిణీపై నిఘా ఉండాలి…కలెక్టర్ పి. ప్రశాంతి

రైతులకు ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శక ఉండాలి అని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. మండలంలోని తోకాడ, భూపాలపట్నం సహకార సంఘాల ఎరువుల  గిడ్డంగులను జిల్లా కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు యూరియా అవసరం ఉంటుంది అని రైతులను అడిగారు. దీనిపై 3-4 లేదా 2-3 బస్తాలు సరిపోతాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెప్పిన విధంగా ప్రభుత్వం 50 శాతం, ప్రైవేటుగా 50 శాతం పంపిణీ జరగాలని జరుగుతుందన్నారు. అవసరానికి మించి ఎరువుల వినియోగం జరిగితే వ్యవసాయేతర అవసరాలకు జరిగినట్టు భావించాలన్నారు. ఎరువులను దుర్వినియోగం జరగకుండా రెవెన్యూ, వ్యవసాయ, హార్టికల్చర్, సహకార శాఖల అధికారులు బృందాలు ఏర్పడి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించు వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి ఎం. వెంకటరమణ, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ డి. ప్రతాప్ తదితరులు ఉన్నారు.