User Avatar others

సమస్యగా ప్రజా సమస్యల పరిష్కారం వేదిక

సమస్యలు తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కారం వేదిక (పిజిఆర్ఎస్)కు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రభుత్వం ఆదేశాలు లెక్క లేకపోవడం లేదా సమయం వృదా తప్పు జేబుల్లోకి ఒక్క రూపాయి రాదు అనుకున్నారేమో కానీ రాజానగరం మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు ఒక్క అధికారి హాజరు కాలేదు. మెక్కి బడిగా ఏడుగురు అధికారులు వచ్చినా రిజిస్టర్ లో సంతకాలు చేసి గైర్హాజరయ్యారు. రాష్ట్ర రాజధాని అమరావతి, జిల్లా కలెక్టర్ కార్యాలయం, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం పిజిఆర్ఎస్ ఉదయం 10.00 గంటలు నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఏర్పాటు చేసి ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశాలు ఉన్నాయి. ఇది రాష్ట్రం అంతా అమలు జరిగినా రాజానగరం మండలంలో అమలు జరగడం లేదు. తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పిజిఆర్ఎస్ కు తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ ఉన్నారు.  ఐసిడిఎస్ శాఖ నుండి ముగ్గురు, పోలీసు శాఖ, ఎసిడిపిఒ శాఖ హాజరై రిజిస్ట్రేషన్ లో సంతకాలు చేసి గైర్హాజరయ్యారు. గత వారంలో 14వ తేదీన నిర్వహించిన పిజిఆర్ఎస్ ఇదేవిధంగా ఉంది.  రాజానగరం మండల కేంద్రంలో ప్రధాన కార్యాలయాలు, మండలంలో 34 సచివాలయాలు ఉన్నాయి. వీరిలో చాలా మంది రిజిస్టర్ లో పిజిఆర్ఎస్ కు వెలునట్టు నమోదు చేసి ఉన్న  హాజరు కారు. ప్రజలు కార్యాలయాలు వెలితే అధికారు పిజిఆర్ఎస్ వెళ్ళారని క్రింద స్ధాయి సిబ్బంది చెప్పడం విశేషం.  ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వాని నేరుగా చెప్పుకోడానికి ఓకే ఒక్కటి ప్రజా సమస్యల పరిష్కారం వేదిక. దీనిని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేనిచో ప్రభుత్వ ఆదేశాలకు, ప్రజా సమస్యలకు విలువ ఉండదు.