User Avatar Crime

రాజానగరం, గోకవరం మండలాల్లో ఎరువుల గోదాముపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు దాడులు

రాజానగరం, గోకవరం మండలాల్లో ఎరువుల గోదాముపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం దాడులు చేశారు.  రాజానగరం మండలం భూపాలపట్నం సొసైటీలో యూరియా  రిజిస్ట్రేషన్ లో ఉన్న సరుకు గోదాముల్లో ఉన్న దానికి రూ.19,80,940  వ్యత్యాసం ఉన్నట్లుగా అధికారుల గుర్తించారు. గోదాముల్లో యూరియా బస్తాలు ఒక క్రమ పద్దతిలో లేకపోవడం వలన రికార్డు లో తేడాలు ఉన్నాయని వీటిని వెంటనే సరి చేయాలని చేయాలని సూచించారు. అప్పటి వరకు అమ్మకాలు నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఈ దాడులలో  విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ జి మధుబాబు, అసిస్టెంట్ జియోలజిస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్.వి.లక్ష్మీనారాయణ, మండల వ్యవసాయ అధికారి ఎ. కళ్యాణ్ సూర్యకుమార్ పాల్గొన్నారు.                        గోకవరం మండలం కమరాజుపేట సొసైటీలో వ్యవసాయ సహాయ సంచాలికులు జె.శశి బిందు, మండల వ్యవసాయ అధికారిణి పి. రాజేశ్వరి, కోరుకొండ సి ఐ వై.సత్యకిశోర్, ఎస్ ఐ పవన్ కుమార్ తనిఖీలు చేశారు.  మండలంలో సొసైటీలో 172 టన్నులు,  ప్రయివేటు షాపుల్లో 20 టన్నులు యూరియా అందుబాటులో ఉందని చెప్పారు.