User Avatar News

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తనిఖీలలో బయటపడ్డ అవినీతి… నాయకులతో కుదిరిన ఒప్పందం.

2024-25 ఆర్ధిక సంవత్సరానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన సిసి రోడ్లు, డ్రెయిన్లు నిర్మాణంలో భారీ స్ధాయిలో అవినీతి 17వ సామాజిక తనిఖీల్లో బయటపడింది. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు, రాజకీయకు లక్షలాది రూపాయలు డబ్బులు ఒప్పందం కుదిరింది అని విమర్శలు వస్తున్నాయి. ఈనెల 6వ తేదీన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మండారపు సీతారత్నం అధ్యక్షతన ఎన్జీఆర్ఇజిఎస్ పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. దీనిలో 1375 పనులకు రూ.12,03,21,228 నిధులు ఖర్చు చేశారు. దీనిలో 96 సిసి రోడ్లకు రూ.5,93,79,841, డ్రైనేజ్ 10 నిర్మాణానికి రూ.4,52,344 ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో చూపించారు. తనిఖీల్లో రూ.2,43,223 రికవరీ చేయగా పెనాల్టీ గా రూ. 28 వేలు వేశారు. మండలంలో నిర్మించిన 96 సిసి రోడ్లు పూర్తిగా నిర్మించుకుండా రికార్డుల్లో చేసినట్లుగా నమోదు చేసి సుమారు రూ. 2 కోట్ల వరకు గోల్ మాల్ జరిగిందని విమర్శలు వస్తున్నాయి. దీనిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ఫిర్యాదు చేస్తామని కొందరు రాజకీయ నాయకుల మండలలో అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అయితే ఫిర్యాదు చేయకుండా రూ.12 లక్షలు ఇస్తామని నాయకులతో అధికారులు అనాధికార ఒప్పందం కుదుర్చుకున్నట్ట కాబట్టి అవినీతి జరిగినా ఫిర్యాదు చేయడం లేదు అని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఉన్నత అధికారులు పూర్తి స్ధాయిలో దర్యాప్తు జరిపి అవినీతి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొని నిధులను రికవరీ చేయాలని కోరుకుంటున్నారు.