User Avatar News

ఈ నెల 12‌వ తేదీన మోడల్ కెరీర్ సెంటర్ లో జాబ్ మేళా

ఈ నెల 12వ తేదీ మోడల్ కెరీర్ సెంటర్ లో జాబ్ మేళా ఉందని  జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. దీనిలో రాయ్స్ కాపిటల్, ఎమ్‌సి‌వి మోటార్స్, ఎమ్‌టిబి లిఫ్ట్స్, టీమ్ లీజ్ తదితర కంపెనీ ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన వారు వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలని చెప్పారు. అర్హత ఉన్నవారు ముందుగా https://tinyurl.com/jf1may25  ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఇంటర్వ్యూ సమయంలో బయో డేటా, ఆధార్ కార్డు, విద్యా అర్హత సర్టిఫికెట్ తో రావాలని అన్నారు.  వివరాలకు 9533221189 నంబర్‌ కు సంప్రదించాలని కోరారు.