User Avatar News

పుణ్యక్షేత్రం విదేశీ పక్షుల సంరక్షణకు రూ. 4 కోట్లు నిధులతో అభివృద్ధి

రాజానగరం మండలం పుణ్యక్షేత్రం విదేశీ పక్షుల సంరక్షణకు రూ. 4 కోట్లు నిధులతో అభివృద్ధి చేస్తామని రాజానగరం శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ అన్నారు. వీటి సంరక్షణకు అటవీశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. దీనిలో ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ ఈ గ్రామానికి 125 ఏళ్ళుగా వస్తున్నాయని ఊర చెరువు గట్టుపై గూళ్ళు కట్టుకుని  ఆరు నెలలు ఇక్కడే ఉండి ఆహ్లాదాన్ని పంచుతాయని వివరించారు. వీటిని చూడడానికి సందర్శకుల కోసం వాచ్ టవర్లు, చిల్డ్రన్ ప్లే జోన్లు, పక్షుల ఆవాసాల కోసం ప్రత్యేక నిర్మాణాలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. దీనిలో జిల్లా అటవీ అధికారి వి. ప్రభాకరరావు,  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డేవిడ్ రాజు, డిప్యూటీ రేంజర్ పద్మావతి దేవి, తహశీల్దార్ జి.ఏ.ఎల్.ఎస్. దేవి, ఎంపిడిఓ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.