User Avatar News

వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటితే వృత్తి పన్ను చెల్లించాలి..

వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారంతా వృత్తి పన్ను ఏడాదికి రూ.1250  చెల్లించాలని సెల్స్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్ ఎవి శ్రీనివాసరావు అన్నారు. ఇది ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఉపయోగిస్తారని చెప్పారు.  రాజానగరంలో సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం ఆవరణలో వృత్తి పన్నుపై స్ధానిక వర్తక వ్యాపారులతో అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిలుగా అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాసరావు పాల్గొని అమ్మకం, ఆదాయంపై ప్రభుత్వం విధిస్తున్న జిఎస్టి పన్నుల గురించి వివరించారు. నూతనంగా ప్రారంభించాల్సిన వ్యాపారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ తెలిపారు.  దీనిలో అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఎ.సురేష్,  ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంకటాల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు లంక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు