User Avatar Crime

శ్రీ గంధం చెక్కల దొంగలు అరెస్టు..,

గంధం చెట్లను నరికి దొంగిలిస్తున్న ముఠాను రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుండి రూ. 3,50,000 విలువైన శ్రీ గంధం చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసు స్టేషన్ లో నిందితులతో సిఐ ఎస్.పి. ప్రసన్న వీరయ్య గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. మండలంలో నందరాడ చెందిన దొడ్డా సోమేశ్వరరావు 12 ఎకరాల కొబ్బరి, మామిడి, టేకు, ఎర్ర చందనం తోటలకు సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. ఈనెల 16వ తేదీన తోటలో ఉన్న రెండు గంధం చెట్లు గుర్తు తెలియని వ్యక్తులు మొదలు వరకు నరికి దొంగిలించారని పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ డి. నరసింహా కిషోర్ ఆదేశాల మేరకు డిఎస్పీ వై. శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిలో మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్ని జిల్లా సుగవాన్ గ్రామం చెందిన జులిస్ ఆదివాసీ, శివరాజ్ ఆదివాసీ, ఉల్లిస్ లను నిందితులు గుర్తించి వీరి నుండి 53 శ్రీ గంధం ముక్కలు, చెట్లు నరడానికి ఉపయోగించిన గొడ్డలి, రంపం బ్లేడు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దివాన్ చెరువు జాతీయ రహదారి జీరో పాయింట్ దగ్గర అరెస్టు చేసి సోమవారం కోర్టుకు తరలించారు. ఒకొక్క గంధం చెక్క సుమారు 10 కేజీలు గా నరికారని విలువ రూ. 10 వేలు నుండి 30 వేలు ఉంటుందని సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ చెప్పారు. గతంలో కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో శ్రీ గంధం చెక్కల దొంగతనంలో శివరాజ్ ఆదివాసీపై కేసు ఉందన్నారు. వీరంతా కుటుంబాలతో గ్రామాల్లో గుడారాలు వేసుకుని ఉంటూ రుద్రాక్ష, కాశీ తాడులు, గవ్వలు అమ్ముతూ సంచారం చేస్తూ గంధం చెట్లు ఎక్కడ ఉన్నాయి గుర్తించి వాటిని ముక్కలు నరికుతారని చెప్పారు. వీరితో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ చెందిన రాజు అనే వ్యక్తి చేయిస్తున్నాడన్నారు. ఇతనిపై గతంలో ఏలూరు పోలీసులు స్టేషన్ లో కేసులు ఉన్నాయని ఇక్కడ కేసు నమోదు చేశామని పరారీలో ఉన్నాడని చెప్పారు. నిందితులు సంచార జీవితం గడపడం వలన అత్యంత చాకచక్యంగా గుర్తించి పెట్టుకున్నామని చెప్పారు. ఎస్ఐ ఎస్. ప్రియ కుమార్, హెడ్ కానిస్టేబుల్ పి. అమ్మి రాజు, కానిస్టేబుల్స్ ఎం. సత్యనారాయణ, ఎస్.కె.కరీమ్, వెంకట రమణ, నాగేశ్వరరావు, జి.కిషోర్ కుమార్ లను సిఐ అభినందించారు.