User Avatar News

రాజానగరం నియోజకవర్గం ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం.

రాజానగరం నియోజకవర్గం ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడుగా సయ్యద్ కరీముల్లా ఏకగ్రీవంగా నియామకం జరిగింది. కోరుకొండలో వివి రెడ్డి పంతులు సత్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ రవికుమార్, పోతుల వెంకటేష్, రాంబాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దీనిలో అధ్యక్షుడుగా సయ్యద్ కరీముల్లా, కార్యదర్శిలు కె. నరసింహమూర్తి, ఈశ్వర్ కుమార్, కార్యవర్గం సభ్యులను ఏకగ్రీవంగా తీర్మాణం చేసి నియామకం చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి నరసింహమూర్తి అధ్యక్షత ఏర్పాటు చేసిన సభలో జిల్లా కన్వీనర్ రవికుమార్ మాట్లాడుతూ సంఘంలో సభ్యులందరికీ జర్నలిస్టు గుర్తింపు అక్రిడేషన్స్, జర్నలిస్టు ఆరోగ్యం భీమా, సొంత ఇంటి స్థలం తదితర వాటి కోసం కృషి చేస్తానని చెప్పారు. జర్నలిస్టులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనిలో సీతానగరం, కోరుకొండ, రాజానగరం, గోకవరం విలేకరులు పాల్గొన్నారు.