User Avatar Crime

రాజానగరంలో 13 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

రాజానగరం పౌర సరఫరాల శాఖ అధికారులు అక్రమంగా ఐషర్ వ్యాన్ తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. దీనిపై మండలం పౌర సరఫరాల అధికారి గులుగూరి బాపిరాజు తెలిపిన వివరాలు‌. మంగళవారం తెల్లవారుఝామున అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. దీనిలో కృష్ణ జిల్లా ఉయ్యురు నుండి కాకినాడ జిల్లా పిఠాపురం ఒక ఐషర్ వ్యాన్ లో వెళుతున్న 13750 కేజీల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బియ్యం విలువ రూ.6,32,500, వ్యాన్ విలువ రూ.12,00,000 వీటిని సీజ్ చేసి బియ్యం యజమాని గొల్లప్రోలుకు చెందిన గారపాటి రాజు, వ్యాన్ డ్రైవర్ పిఠాపురం చెందిన కోరసిక విజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.