User Avatar News

రాజానగరం గ్రామ సభలో రెవెన్యూ విడదీయడంపై వాగ్వివాదం..జియస్ఎల్ మెడికల్ కళాశాల వ్యర్ధాలు నివారణ చర్యలు చేపట్టాలి..

­జియస్ఎల్ మెడికల్ కళాశాల వ్యర్ధాలు ట్రాక్టర్లలో రావులు చెరువు గట్టు ప్రక్కన స్మశాన వాటికలో వేయడం జరుగుతుందిని వెంటనే నిలుపుదల చేయాలని రాజానగరం  సర్పంచ్ కుందేటి ప్రసాద్ అధ్యక్షతన గ్రామ సభలో డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో సూర్యారావుపేట ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని పి.సురేష్, ప్రసాద్ తదితరులు, ఎప్పటిలాగే కొనసాగాలని వార్డు సభ్యుడు ప్రగడ చక్రి, జక్కంపూడి సూరిబాబు తదితరులు ఇరువురు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. సచివాలయం గ్రామ సభలు గురువారం నిర్వహించారు. దీనిలో సచివాలయం కార్యదర్శిలు ఎన్. ప్రసాద్, టి. దుర్గా భవానీ, ఎన్.శాంతి, విఆర్ఓ సత్యానందం, వైకాపా మండలం కన్వీనర్ దూరం పెద్ద, మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పిడి శ్రీను, మాజీ ఉపసర్పంచ్ కామిశెట్టి విష్ణు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.