User Avatar Crime, News

మోటారు సైకిళ్ళు ఢీ కొని ఇద్దరు మృతి

మోటారు సైకిళ్లు అతి వేగంగా ఎదురుగా ఒకరికొకరు ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలం నందరాడ శివారులో జరిగింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు. రాజానగరం సుబ్బారావు కాలనీ చెందిన గుద్దిరెడ్డి సత్యనారాయణ(30) కోరుకొండ నుండి స్కూటీ రైడర్ మోటారు సైకిల్ పై ఇంటికి వస్తున్నాడు‌‌. కొవ్వూరు చెందిన మేర్ల శ్రీనివాస్(45) గ్లామర్ మోటారు సైకిల్ పై రాజానగరం నుండి కోరుకొండ వైపుకు వెలుతున్నాడు. ఇద్దరూ వేగంగా వెలుతూ ఒకరికొకరు ఎదురుగా నందరాడ శివారులో ఢీ కున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సత్యనారాయణకు జుట్టు కూలీ పని చేస్తూ భార్య, కుమారుడు, కుమార్తె ను పోషిస్తున్నాడు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.