User Avatar News

రాజానగరంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ర్యాలీ

గత పాలకులు పన్నులను పెంచి ప్రజలపై భారాన్ని మోపితే కూటమి ప్రభుత్వం పన్నులను తగ్గించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇస్తుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. రాజానగరంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తున్నారు. మోటార్ వాహనాలపై 18% ఉన్న జిఎస్టీ 10% కు తగ్గించారని ఇదేవిధంగా ఇతర వస్తువులపై ప్రతి కుటుంబానికి నెలసరి రూ.15,000 ఆదా అవుతుందని చెప్పారు. దీనిలో రవాణా శాఖాధికారులు, ఆటో యూనియన్, టిడిపి జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.