User Avatar Crime

అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారులు దాడులు

కోరుకొండ మండలం రాఘనపురంలో అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలు చేస్తున్నారని సమాచారం రావడంతో జిల్లా జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి డి.ఫణి భూషణ్ రెడ్డి గురువారం దాడులు చేశారు. దీనిలో టాటా హిటాచి (చైన్ మౌంటెడ్ పాన్) యంత్రంతో సర్వే నంబర్లు 44/2, 44/3 లో అక్రమంగా 19,300 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ త్రవ్వబడినట్లు గుర్తించారు. వెంటనే యంత్రాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. దీనిలో సర్వేయర్ పి. శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది ఎ. శ్రీనివాస్, వి. రామనపురం, కె. మురళీ తదితరులు పాల్గొన్నారు.