User Avatar Crime

రాజానగరంలో వివాహిత ఆత్మహత్య

రాజానగరం సమీపంలో సూర్యారావుపేట భర్తతో వివాదం కారణంగా నాగరాజు శ్రీజ్యోతి(25) అనే వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాలు. మృతురాలు తల్లి దుబాయ్ ఉంటూ కుమార్తెకు డబ్బులు పంపుతుంది. వీటిని భర్త కృష్ణ తీసుకుని జులాయిగా ఖర్చు చేస్తున్నాడు. దీనిపై భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డడడంతో తీవ్ర మనస్థాపం చెంది శ్రీజ్యోతి ఇంట్లో ఫ్యాన్ కు చీర వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఏడాదిన్నర, ఎనిమిది నెలల కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.