User Avatar Crime

అంతరాష్ట్ర లారీల దొంగల ముఠా అరెస్టు.

జాతీయ రహదారిపై లారీలు దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. లారీ స్వాధీనం చేసుకుని నిందితులతో సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్, నార్త్ జోన్ డిఎస్పీ వై. శ్రీకాంత్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. దివాన్ చెరువు జాతీయ రహదారి గామన్ బ్రిడ్జి సమీపంలో మన్యం గణేశ్వరరావుకు శ్రీ కృష్ణ ఇన్ఫ్రా లారీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసు ఉంది. గత నెల 25వ తేదీన వివాహానికి వెలుతూ ట్రాన్స్ పోర్ట్ ఎదురుగా తన స్నేహితుడైన ఎఎన్ఆర్ కాటా లారీ యజమాని అబ్బిరెడ్డి నాగేశ్వరరావు ప్రక్కన కాలీ స్థలంలో నాలుగు లారీలు ఉంచి తాళాలు కాటా లారీ ఆఫీస్ లో ఇచ్చాడు. మరునాడు ఉదయం వచ్చి చూస్తే ఒక టిప్పర్ లారీ కనపడలేదు. దీనిపై అబ్బిరెడ్డి నాగేశ్వరరావుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. సిసి కెమెరాలు ఆధారంగా కొవ్వూరు మండలం దొమ్మేరు సమీపంలో లారీని స్వాధీనం చేసుకున్నారు. దీనికి రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన భారత్ పూర్ జిల్లా ఖోహి తాలుకా ధహోటా గ్రామం షాకత్ ఖాన్, అల్వార్ జిల్లా శేఫూర్ గ్రామం జమాన్ ఖాన్, సోహిల్, హైదరాబాద్ లో వనస్థలపురం చెందిన మహ్మద్ ఫసిఉద్దీన్ లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి కోర్టుకు తరిలించారు. లారీ విలువ రూ.42 లక్షలు ఉంటుందని చాకచక్యంగా నిందితులను పట్టుకున్న ఎస్ఐ ఎస్. ప్రియ కుమార్, హెడ్ కానిస్టేబుల్ అమ్మిరాజు, నరేష్ రాజు, సత్యనారాయణ,క్రీం, సురేష్, బివి రమణ అను అభినందించారు.