User Avatar News

నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలి… కలెక్టర్ కీర్తి చేకూరి

మొంథా తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరా నిరంతరం ఉండాలని  విద్యుత్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. రాజానగరం విద్యుత్ సబ్ స్టేషన్ ను జిల్లా కలెక్టర్ సోమవారం రాత్రి ఆకస్మిక సందర్శించి క్షేత్ర స్ధాయిలో చేపడుతున్న పనులను అడిగారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌ సామర్థ్యం వివరాలు అధికంగా గాలులు వీస్తూ వర్షం వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఆమె వెంట ఏపీఈపిడిసీఎల్ ఎస్.ఈ కే. తిలక్ కుమార్, ఎఇ విఎన్ సుధాకర్ ఉన్నారు.