User Avatar News

జిల్లాలో 361 కుటుంబాలు, 1193 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు…జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

మొంథా తుఫాన్ ప్రభావం వలన జిల్లాలో 361 కుటుంబాలు, 1193 మంది పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు                                          👉 కొవ్వూరు డివిజన్ లో మద్దూరు, కొవ్వూరు, నల్లజర్ల, దూబచెర్ల, ఖండవల్లి, పెరవలి, నిడదవోలు ప్రభుత్వ పాఠశాలల్లో శిబిరాలు ఏర్పాటు చేసి విద్యుత్, తాగునీటి, వైద్యం, ఆహారం తదితర సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఇక్కడ 264 కుటుంబాలకు చెందిన 912 మంది ప్రజలు ఉన్నారన్నారు.
👉 రాజమహేంద్రవరం డివిజన్ లో కాతేరు, హుకుంపేట ఏర్పాటు చేసిన శిబిరాల్లో 97 కుటుంబాలకు చెందిన 281 మంది ప్రజలు ఉన్నారన్నారని చెప్పారు.
తుఫాను ప్రభావం జిల్లాలో 272 రెవెన్యూ గ్రామాల్లో 28, 29 తేదీల్లో అధికంగా వర్షం, గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు.