User Avatar News

లక్ష్యాలు భవిష్యత్ నిర్ణయిస్తాయి.. డిఎస్పీ వై. శ్రీకాంత్

విద్యార్ధిగా ఉన్నప్పుడు  భవిష్యత్ లక్ష్యాలను నిర్ణయించుకుని కష్టపడితే  ఉన్నత స్ధాయికి చేసుకుంటామని ఉత్తర మండలం డిఎస్పీ వై. శ్రీకాంత్ అన్నారు. చెడు అలవాట్లుకు బానిసలైన వారు నేరాలు పాల్పడుతున్నారన్నారు. రాజానగరం మండలం కానవరం గాయత్రి విద్యాసంస్థ ఆవరణలో  సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిలుగా పాల్గొన్న డిఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ఉన్నామని ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు తన మేధస్సును పెంచుకోవాలని సూచించారు. చదువు ప్రక్కదారి పట్టించు ర్యాగింగ్ చేయడం, ఆన్లైన్ బెట్టింగ్ వేస్తే కేసులు నమోదు చేసి జైలుకి పంపుతామని హెచ్చరించారు. దీనిలో కరస్పాండెంట్ వివిఎస్ఎన్ మూర్తి ,ప్రిన్సిపల్ దేవీ బంగారం, సురేష్, మహేష్,  రవికుమార్  తదితరులు పాల్గొన్నారు.